సంచలన తీర్పు.. నిందితులకు జీవిత ఖైదీ
కృష్ణా జిల్లా సెషన్స్ జడ్జి గోపి గురువారం ఒక సంచలన తీర్పు వెలువరించారు. 2013 ఫిబ్రవరి 28న బందరు (M) బుద్దాలపాలెంకు చెందిన కాగిత రామ్మోహనరావు హత్య కేసులో ఏడుగురు నిందితులకు జీవిత ఖైదు విధించారు. శొంఠి పైడేశ్వరరావు, బొర్రా శ్రీనివాసరావు, బొర్రా స్వామికృష్ణ, కాగిత సోమయ్య, శొంఠి వీర వెంకటేశ్వరరావు, శొంఠి వీరాంజనేయులు, శొంఠి ముసలయ్యలను దోషులుగా నిర్ధారించి శిక్ష విధించారు.