4 సార్లు ఓటమి.. అయిన సర్పంచ్ బరిలోకి!
బెజ్జంకి గ్రామ సర్పంచ్ పదవికి గతంలో నాలుగు సార్లు ఓటమి చెందిన కొండ్ల వెంకటేశం ఈసారి కూడా వెనుదీరకుండా ఐదవసారి ఎన్నికల రణరంగంలోకి దిగారు.1995, 2001, 2006, 20195 చవిచూసిన ఆయన, ఇప్పుడు జరుగుతున్న రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మళ్లీ బరిలోకి రావడం గ్రామంలో చర్చనీయాంశమైంది. తనకు ఉన్న సానుభూతితో తప్పకుండా విజయం సాధిస్తానని వెంకటేశం ధీమా వ్యక్తం చేస్తున్నారు.