కుప్పంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

CTR: కుప్పంలోని టీడీపీ కార్యాలయం వద్ద ఆ పార్టీ కార్యకర్తలు గురువారం సీఎం చంద్రబాబుకు పాలాభిషేకం చేశారు. మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా మత్స్యకారులకు రూ. 20 వేలు అందించిన సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు పలువురు పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని వారు ధీమా వ్యక్తం చేశారు.