రైతులకు యూరియా పంపిణీ చేసిన సొసైటీ ఛైర్మన్ గోపాల్

రైతులకు యూరియా పంపిణీ చేసిన సొసైటీ ఛైర్మన్ గోపాల్

KRNL: నందవరం మండల ముగతి గ్రామంలో మండల వ్యవసాయ అధికారి సరిత ఆధ్వర్యంలో శనివారం రైతులకు యూరియా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సొసైటీ ఛైర్మన్ ధర్మాపురం గోపాల్ మాట్లాడుతూ.. మండలంలో యూరియా కొరత రానివ్వమని తెలిపారు. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.