చెరువులోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు... తప్పిన ప్రమాదం
SRPT: మునగాల మండలం నేలమర్రిలో స్కూల్ బస్సు చెరువులోకి దూసుకెళ్లిన సంఘటన ఈరోజు జరిగింది. ప్రమాద సమయంలో ప్రైవేట్ పాఠశాల బస్సులో 15 మంది విద్యార్థులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. స్థానికుల సాయంతో విద్యార్థులను సురక్షితంగా రక్షించారు. చెరువు కట్టపై ఉన్న చెట్టు అడ్డుపడడంతో పెను ప్రమాదం తప్పింది. సెయింట్ పోల్స్ పాఠశాల బస్సుగా స్థానికులు గుర్తించారు