'ఓటర్ల మ్యాపింగ్ పకడ్బందీగా చేపట్టాలి'
SRPT: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణలో భాగంగా మ్యాపింగ్ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ఆదేశించారు. సీఈఓ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. బీఎల్వోలు ఇంటింటికీ తిరిగి మ్యాపింగ్ చేయాలని, పెండింగ్‌లో ఉన్న ఫారం 6, 7, 8 దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు.