పరకాలలో డ్రైనేజీ పనుల్లో తీవ్ర నిర్లక్ష్యం

పరకాలలో డ్రైనేజీ పనుల్లో తీవ్ర నిర్లక్ష్యం

HNK: పరకాల పట్టణంలో జరుగుతున్న డ్రైనేజీ పనుల్లో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. జయ డీలక్స్ రోడ్డులో డ్రైనేజీ మార్గం మధ్యలోనే కరెంట్ స్తంభాన్ని ఉంచి పనులు కొనసాగించడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెత్త చేరితే నీటి ప్రవాహం అడ్డుకునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. అధికారులు వెంటనే స్పందించి స్తంభాన్ని సరిచేయాలని కోరారు.