బాధిత కుటుంబానికి చెక్కు అందజేసిన మున్సిపల్ కమిషనర్
JGL: రాయికల్ మహిళా పట్టణ సమాఖ్యకు చెందిన కొత్తపల్లి గంగు అనారోగ్యంతో మరణించగా బుధవారం మున్సిపల్ కమిషనర్ మనోహర్ గౌడ్ ఇన్సూరెన్స్ చెక్కును అందించారు. ఆమె స్త్రీ నిధి ద్వారా రూ.లక్ష లోన్ తీసుకొని రికవరీ మొత్తం రూ.84,643 క్లియర్ చేసుకొని, ఇన్సూరెన్స్ మొత్తం రూ.12,600ను సభ్యురాలి నామినీకి అందజేశారు. మెప్మా టీఎంసీ శరణ్య, ఆర్పీ జ్యోత్స్న, పాల్గొన్నారు.