'బుగ్గారంలో మూడు నెలలుగా చీకట్లోనే 30 ఇళ్లు'
ADB: నెరడిగొండ మండలం బుగ్గారంలోని 30 ఇళ్లకు మూడు నెలలుగా విద్యుత్ సరఫరా లేకపోవడంపై సర్పంచ్ రాథోడ్ కృష్ణ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల ప్రజా ప్రగతి సభలో ఆయన అధికారుల జాప్యాన్ని నిలదీశారు. సర్పంచ్ పట్టుదలకు స్పందించిన విద్యుత్ శాఖ ఏఈ, సమస్యను తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యలపై గళమెత్తిన సర్పంచ్‌ను గ్రామస్తులు అభినందించారు.