ఆదోనిలో రెండో రోజుకు చేరిన నిరహార దీక్ష

ఆదోనిలో రెండో రోజుకు చేరిన నిరహార దీక్ష

KRNL: ఆదోని పట్టణంలో దేవాలయ స్థలం కబ్జాకు గురైందని బీజేపీ నాయకుడు యువరాజ్ బుధవారం రెండో రోజు నిరాహార దీక్ష చేపట్టారు. శుక్రవారంపేట మారెమ్మవ్వ ఆలయానికి చెందిన 4.2 ఎకరాల భూమిని వైసీపీ నాయకుడు రఘునాథ్ ఆక్రమించారని ఆయన ఆరోపించారు. రెవెన్యూ అధికారులు తక్షణమే విచారణ చేపట్టి, నిందితుడిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.