నిషేధిత పాలిథిన్ కవర్లు వాడితే కఠిన చర్యలు

నిషేధిత పాలిథిన్ కవర్లు వాడితే కఠిన చర్యలు

SRD: సదాశివపేట మున్సిపాలిటీలో ఎవరైనా నిషేధిత పాలిథిన్ కవర్లు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ శివాజీ ఆదివారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. పాలిథిన్ కవర్లపై తనిఖీలు చేసేందుకు మున్సిపాలిటీలో ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వ్యాపారులు జ్యూట్, బట్ట బ్యాగులను మాత్రమే వాడాలని చెప్పారు.