చండూరులో ఘనంగా దివ్యాంగుల దినోత్సవం

చండూరులో ఘనంగా దివ్యాంగుల దినోత్సవం

NLG: చండూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని భవిత సెంటర్‌లో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగ విద్యార్థులతో ఆటల పోటీలు నిర్వహించి వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఎంఈవో వి.సుధాకర్ రెడ్డి గారు, హెచ్ఎంలు, టీచర్ శ్వేత పాల్గొని విద్యార్థులకు బహుమతులు అందజేశారు.