బీఆర్ఎస్‌పై కవిత తీవ్ర విమర్శలు

బీఆర్ఎస్‌పై కవిత తీవ్ర విమర్శలు

NZB: జాగృతి జనం బాట పేరుతో జిల్లాల్లో పర్యటిస్తున్న కల్వకుంట్ల కవిత, బీఆర్ఎస్ పార్టీ నుంచి తనను అవమానకరంగా బయటకు పంపించారని ఆరోపించారు. ఉరి వేసే ముందు ఖైదీకి చివరి కోరిక అడిగే అవకాశం ఉంటుందని, కానీ తనకు కనీసం షోకాజ్ నోటీసు కూడా ఇవ్వకుండా సస్పెండ్ చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నన్ను ప్రోటోకాల్ పేరుతో నిజామాబాద్‌కే పరిమితం చేశారని అన్నారు.