'SC, STలకు ఉచిత సోలార్ కరెంట్'
నెల్లూరు జిల్లాలో SC, STలకు ఉచితంగా సోలార్ కరెంట్ అందిస్తామని విద్యుత్ శాఖ SE రాఘవేంద్రం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. కుల ధృవీకరణ పత్రంతో పాటు సొంత ఇల్లు ఉండి, మీ పేరు మీద కరెంట్ బిల్ ఉంటే ఈ పథకానికి అర్హులని పేర్కొన్నారు. జిల్లాకు ఇప్పటికే 6,500 కిట్లు చేరాయని చెప్పారు. అర్హులైనవారు గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.