కోడూరులో రేపు జాబ్ మేళా

కోడూరులో రేపు జాబ్ మేళా

అన్నమయ్య: రైల్వే కోడూరులోని విశిష్ట డిగ్రీ కళాశాలలో రేపు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ నారాయణ, వరప్రసాద్ తెలిపారు. అపోలో, పేటీఎం, టీవీఎస్ తదితర కంపెనీ ప్రతినిధులు ఈ జాబ్ మేళాకు హాజరై నిరుద్యోగ యువతీ, యువకులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని, అర్హత కలిగిన వారిని ఎంపిక చేస్తారని తెలిపారు. నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు.