'బీడీ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి'
SRCL: బీడీకార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని బీడీ కార్మిక సమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శి ఎస్. కాశీ విశ్వనాథం అన్నారు. వేములవాడలో అదివారం ఏఐటీయూసీ అనుబంధం సంస్థ అయిన అల్ ఇండియా బీడీ, సిగార్, టోబాకో వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ కౌన్సిల్ ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. బీడీ కార్మిక పిల్లలకు స్కాలర్‌షిప్ ఇంటి నిర్మాణానికి సహాయం అందించాలన్నారు.