VIDEO: సత్తెనపల్లి ఆలయాల్లో.. చోరీ సీసీ కెమెరాలో దృశ్యాలు
PLD: సత్తెనపల్లిలోని ప్రసిద్ధ శివాలయం, వేణుగోపాల స్వామి ఆలయాల్లో బుధవారం తెల్లవారుజామున దుండగులు చోరీకి పాల్పడ్డారు. కటింగ్ మిషన్లతో హుండీలను పగలగొట్టి అందులోని నగదును దోచుకెళ్లారు. ఈ చోరీ దృశ్యాలు ఆలయాల సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. రెండు ఆలయాలు దేవాదాయ శాఖ పరిధిలో ఉండటంతో, అధికారులు ఫిర్యాదు చేయగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.