డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేసిన పోలీసులు
HNK: కాజీపేట మండల కేంద్రంలో ట్రాఫిక్ పోలీసులు బుధవారం సాయంత్రం ప్రైవేట్ స్కూల్ బస్సుల డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను నిర్వహించారు. ట్రాఫిక్ సీఐ వెంకన్న ఆధ్వర్యంలో సిబ్బంది వేరువేరుగా పలు ప్రాంతాల్లో మకాం వేసి 150 మంది డ్రైవర్లకు బ్రీత్ ఎనలైజర్ లతో పరీక్షలు నిర్వహించారు. ఎస్సైలు సంపత్, కనక చంద్రం పాల్గొన్నారు.