నాలుగు రోజులపాటు నీటి సరఫరాకు అంతరాయం

RR: నాలుగు రోజులపాటు మిషన్ భగీరథ తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఇబ్రహీంపట్నం మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. గౌరీదేవిపల్లి సబ్ స్టేషన్ 2500 కేడబ్ల్యూ పంపుల రెగ్యులర్ మెయింటెనెన్స్ పనుల నేపథ్యంలో నేడు ఉదయం 6 గంటల నుంచి 14వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు తాగునీటి సరఫరా ఉండదన్నారు.