'ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోండి'
NLG: గ్రామీణ ప్రాంతాలలో లయన్స్ క్లబ్‌లు చేపడుతున్న ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని లయన్స్ క్లబ్ ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ డా.వై.మోహన్ రెడ్డి కోరారు. గురువారం నకిరేకల్ మండలం నెల్లిబండలో ఆ గ్రామానికి చెందిన యానాల శంకర్ రెడ్డి సహకారంతో నకిరేకల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో SRPT లయన్స్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు.