తురకపాలెంలో ఏం జరుగుతోంది: మాజీ ఎంపీ

తురకపాలెంలో ఏం జరుగుతోంది: మాజీ ఎంపీ

AP: గుంటూరు జిల్లా తురకపాలెంలో ఏం జరుగుతుందో ప్రభుత్వం నిగ్గు తేల్చాలని మాజీ ఎంపీ హర్షకుమార్ డిమాండ్ చేశారు. తురకపాలెంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్‌కు వెళ్లిన ఆయన బాధితులకు అందుతున్న వైద్య సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. దొంగసారా వల్ల మరణాలు జరిగాయని గ్రామస్థులు చెబుతున్నట్లు తెలిపారు. కాగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసిన తర్వాత మరణాలు సంభవించలేదు.