తుఫాన్.. సంగం తహసీల్దార్ కీలక సూచనలు

తుఫాన్.. సంగం తహసీల్దార్ కీలక సూచనలు

నెల్లూరు జిల్లాలో తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో సంగం తహసీల్దార్ సోమ్లా నాయక్ పెన్నానది గట్టున ఉన్న గ్రామ ప్రజలను అప్రమత్తం చేశారు. మూడు రోజులపాటు తుఫాన్ ప్రభావం ఉంటుందన్నారు. సోమశిల డ్యామ్ నుంచి పెన్నానదికి భారీగా నీరు విడుదల అవుతున్నందున నది గట్టున ఉన్న 9 గ్రామాల ప్రజలకు జాగ్రత్తలు చెప్పాలని వీఆర్ఓలు, వీఆర్ఎలు సచివాలయ సిబ్బందిని ఆయన ఆదేశించారు.