'ఉపకారవేతనాల ప్రాసెసింగ్ పూర్తి చేయాలి'
ADB: జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఉపకారవేతనాల విడుదల ప్రక్రియను ఈ నెల 15లోగా పూర్తిచేసి షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ లాగిన్ కు పంపించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం రాత్రి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల వివరాలు E-PASS లాగిన్‌లో నమోదు చేయకపోతే HM బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.