మరణించిన ఐదేళ్లకు అంత్యక్రియలు
TG: కరీంనగర్ జిల్లావాసి అంత్యక్రియలు మరణించిన ఐదేళ్లకు జరిగాయి. మెట్‌పల్లికి చెందిన నరేష్(40) బహ్రెయిన్ వెళ్లి అనారోగ్యంతో మరణించాడు. అతని మృతదేహం అక్కడి ఓ ఆస్పత్రి మార్చురీలో ఉందని తాజాగా కుటుంబ సభ్యులకు తెలిసింది. బాడీని ఇక్కడకు తెచ్చే పరిస్థితి లేకపోవడంతో అక్కడే దహన సంస్కారాలు చేసేందుకు భార్య సమ్మతించింది. దీంతో నరేష్ తమ్ముడు వెళ్లి అంత్యక్రియలు పూర్తిచేశాడు.