పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. జాగ్రత్తలు పాటించాలి
కామారెడ్డి జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో బాన్సువాడ మండలం కొల్లూరులో అత్యధికంగా 37.7°C ఉష్ణోగ్రత నమోదైంది. మద్నూర్, బీర్కూర్, బిచ్కుంద మండలాల్లో కూడా ఎండ తీవ్రత అధికంగా ఉంది. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.