సీతారాం ఏచూరికి ఘన నివాళి

సీతారాం ఏచూరికి ఘన నివాళి

AKP: సీపీఐ(ఎం) అఖిలభారత కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి తొలి వర్ధంతిని శుక్రవారం అచ్యుతాపురంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. సీపీఎం అచ్యుతాపురం కన్వీనర్ ఆర్.రాము మాట్లాడుతూ.. సీతారాం ఏచూరి ఉన్నత చదువులు పూర్తి చేసి పేద ప్రజల కోసం నిరంతరం పని చేశారని కొనియాడారు.