'అమలాపురంకు డిగ్రీ కళాశాల మంజూరు'

కోనసీమ: అమలాపురం అభివృద్ధిలో మరో ముందడుగు పడింది. ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో అధిక ఫీజులతో నలిగిపోతున్న పేద విద్యార్థులకు ఊరట లభించింది. అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు దశాబ్దకాలంగా కంటున్న కలకు ప్రతి రూపం ఏర్పడింది. అమలాపురంకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేస్తూ కార్యదర్శి కోనా శశిధర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.