నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

BDK: చర్ల మండల కేంద్రంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. RWS ఫీడర్‌ పరిధిలో అత్యవసర లైన్ల మరమ్మతుల దృష్ట్యా ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు విద్యుత్‌ను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. కావున ఫీడర్ పరిధిలోని విద్యుత్ వినియోగదారులు అధికారులకు సహకరించాలని వారు కోరారు.