పోలీసుల విధులకు ఆటంకం.. నిందితుడికి రిమాండ్

పోలీసుల విధులకు ఆటంకం.. నిందితుడికి రిమాండ్

ATP: ​మద్యం మత్తులో భార్యపై దాడి చేయడమే కాకుండా పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తిని వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాణినగర్ ప్రాంతంలో నిందితుడు మౌలా పోలీస్ రక్షక్ వాహనం అద్దాన్ని ధ్వంసం చేసి పరారయ్యాడు. పోలీసులు అతడిని పట్టుకుని కోర్టులో హాజరుపరచగా, మార్చి 12 వరకు రిమాండ్ విధించారు. అనంతరం జిల్లా జైలుకు తరలించారు.