ఆసుపత్రిలో రోగులకు విశ్వేశ్వర్ రెడ్డి పరామర్శ

ఆసుపత్రిలో రోగులకు విశ్వేశ్వర్ రెడ్డి పరామర్శ

ATP: అనారోగ్యంతో అనంతపురంలోని పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న ఉరవకొండ నియోజకవర్గ వాసులను మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్ రెడ్డి పరామర్శించారు. రోగుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందేలా చూడాలని అక్కడి వైద్యులకు సూచించారు. బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పి, పార్టీ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు.