రేపటి నుంచి పత్తి కొనుగోళ్లు నిలిపివేత
NLG: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) తీసుకువచ్చిన కొత్త నిబంధనలను వ్యతిరేకిస్తూ.. జిల్లాలోని జిన్నింగ్ మిల్లుల యజమానులు రేపటి నుంచి పత్తి కొనుగోళ్లను నిలిపివేయాలని నిర్ణయించారు. సీసీఐ విధించిన కొత్త నిబంధనలతో రైతులకు, తమకు ఆటంకంగా మారుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. దీంతో తొలుత ప్రారంభించిన 9 సీసీఐ కొనుగోలు కేంద్రాలను కూడా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు.