'స్నేహితుని కుటుంబానికి చేయూత'

'స్నేహితుని కుటుంబానికి చేయూత'

WNP: చిన్ననాడు కలిసి చదువుకున్న స్నేహితుడు గుండెపోటుతో కన్నుమూయగా తోటి స్నేహితులంతా ఆయనకుటుంబానికి అండగానిలిచి ఆర్థికసాయం అందించారు. వనపర్తి రజకవీధికి చెందిన డి మహేష్ ఇటీవల గుండెపోటుతో మరణించారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 1990-91టెన్త్ క్లాస్ బ్యాచ్ మిత్రులు రూ.1,51,500 ఆయన కుమార్తెల పేరుమీద పోస్ట్ ఆఫీస్‌లో ఫిక్స్ చేసి బాండ్లను అందజేశారు.