నేడు సామూహిక వందేమాతరం గీతాలాపన

నేడు సామూహిక వందేమాతరం గీతాలాపన

MDK: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఉదయం 10 గంటలకు సామూహికంగా వందేమాతరం గీతాన్ని ఆలపించనున్నారు. నేటితో వందేమాతరం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ మహోత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పాఠశాలలతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా గీతాలాపన చేయాలని అధికారులు ఆదేశించారు.