డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పణకై అవగాహన
MNCL: సింగరేణిలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులు నవంబర్ నెలలో డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించేందుకు అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు యాజమాన్యం వెల్లడించింది. ఈ మేరకు ఈ నెల 12,13 తేదీల్లో శ్రీరాంపూర్, 17, 18 తేదీల్లో మందమర్రి, 24,25 తేదీల్లో బెల్లంపల్లి, గోలేటి ఏరియాల్లో శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.