ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై సమీక్ష

ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై సమీక్ష

NZB: జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పీ.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు సకాలంలో ఇంటిని నిర్మించుకునేలా పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్ని ఇళ్లు మంజూరు అయ్యాయి, ఎన్ని నిర్మాణంలో ఉన్నాయి, ఎన్ని గ్రౌండింగ్‌లో ఉన్నాయి అన్న విషయాలను అడిగి తెలుసుకున్నారు.