గుంతలు పడ్డ రోడ్లను పూడ్చిన అయ్యప్ప స్వాములు
BDK: మణుగూరు పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద రోడ్లపై ప్రమాదకరంగా మారిన గుంతలను అయ్యప్ప స్వాములు సేవా దృక్పథంతో పూడ్చి వేశారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు చర్యలు చేపట్టారు. వీటి వల్ల ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారని, ప్రమాదాల బారిన పడవద్దనే ఉద్దేశంతో తాము ఈ పని చేశామని లాలు గురుస్వామి తెలిపారు.