రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే
ATP: గుమ్మఘట్ట మండలం పులకుంటలో నిర్వహించిన ‘రైతన్నా- మీకోసం’ కార్యక్రమంలో MLA కాలవ శ్రీనివాసులు పాల్గొన్నారు. అన్నదాతల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆయన తెలిపారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ ద్వారా రైతులకు ఏడాదికి రూ.20వేల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. విత్తనం నుంచి పంట విక్రయం వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.