చోరీ కేసులో నిందితుడికి 8 నెలల జైలుశిక్ష
MNCL: చోరీ కేసులో నిందితుడికి ఎనిమిది నెలల సాధారణ జైలుశిక్ష, రూ.100 జరిమానా విధిస్తూ మంచిర్యాల జూనియర్ సివిల్ జడ్జి కె. నిరోషా గురువారం తీర్పు ఇచ్చారు. గత ఏప్రిల్ 27న రాత్రి స్థానిక కాలేజీ రోడ్ లోని మన టిఫిన్ సెంటర్ తాళం పగులగొట్టి నిందితుడు రూ.20 వేలు చోరీ చేశాడు. పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరు పరచగా శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు.