రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

NLG: కోదాడ-జడ్చర్ల జాతీయ రహదారిపై కోలుముంతలపహాడు గేటు వద్ద శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని రామావత్ మధు అనే వ్యక్తి మృతి చెందాడు. కొండమల్లేపల్లిలోని ఫార్మసీలో విధులు ముగించుకుని బైక్‌పై దేవరకొండకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుడికి భార్య, ముగ్గురు సంతానం ఉన్నారు.