జిల్లాలో బీసీ నేతల ముందస్తు అరెస్టులు..
NLG: అక్రమ అరెస్టులతోను బీసీ ఉద్యమాన్ని అణిచి వేయలేరని బీసీ సంఘం నాయకులు హెచ్చరించారు. జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఉన్నందున ముందస్తుగా బీసీ ఉద్యమకారులను అరెస్టు చేసి జిల్లా వ్యాప్తంగా ఆయా పరిధిలోని పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బీసీలకు అన్న మాట ప్రకారం రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలన్నారు.