రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు కొండాపూర్ విద్యార్ధి ఎంపిక
NZB: కొండాపూర్ గ్రామానికి చెందిన విద్యార్ధి యం.శ్రీశాంత్ రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక అయ్యినట్టు ప్రధానోపాధ్యాయులు లాల్ సింగ్ తెలిపారు. ఫిబ్రవరి 5 నుంచి కమ్మర్ పల్లిలో జరిగే రాష్ట్రస్థాయి అండర్-16 వాలీబాల్ పోటీలలో శ్రీశాంత్ పాల్గొంటారు. ఈ ఎంపిక పట్ల PRTU మండల అధ్యక్షులు మోజిరాం, పిడి శ్రీనివాస్,ఉపాధ్యాయులు, సర్పంచ్ మానస శ్రీధర్ శ్రీశాంత్‌ను అభినందించారు.