రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు

కోనసీమ: అమలాపురం మండలం బండారులంకలో ఇవాళ మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అమలాపురం డిపోకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనంపై అంబాజీపేట వైపు వెళ్తున్న యువకుడిని ఢీకొట్టినట్లు తెలిపారు. క్షతగాత్రుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.