అంబా రామలింగేశ్వర స్వామి దేవాలయంలో హుండీ లెక్కింపు

అంబా రామలింగేశ్వర స్వామి దేవాలయంలో హుండీ లెక్కింపు

NGKL: వెల్దండ మండలం గుండాల గ్రామంలో దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ అంబా రామలింగేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం హుండీ లెక్కింపు చేపట్టారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ ఏడాది కూడా బ్రహ్మోత్సవాల్లో భాగంగా జాతర ఉత్సవాలు నిర్వహించారు. భక్తులు కానుకలు, విరాళాల రూపంలో సమర్పించిన ఆదాయాన్ని సిబ్బంది లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు.