రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దు: తహసీల్దార్

SRPT: రైతులను ఇబ్బంది పెట్టకుండా ధాన్యం కొనుగోలు చేయాలని తహసీల్దార్ హరిప్రసాద్ అన్నారు. బుధవారం తిరుమలగిరి మండలం మాలిపురంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసి మాట్లాడారు. తనిఖీల్లో ధాన్యం కాంటాలో క్వింటాకు 2 కిలోలు తేడా ఉండడంతో వెంటనే విషయాన్ని తూనికలు, కొలతల శాఖకు తెలియజేసినట్లు తెలిపారు. కాంటా అయిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలన్నారు.