చవితికి సిద్ధమైన గణనాథులు

ఏలూరు: గణేష్ నవరాత్రి ఉత్సవాలకు వినాయక విగ్రహాలు ముస్తాబవుతున్నాయి. వివిధ ఆకృతుల్లో గణేష్ విగ్రహాలను సిద్ధం చేశారు. చింతలపూడి నియోజకవర్గంలో గ్రామ గ్రామాన గణపతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఆయా కమిటీలు ఏర్పాట్లు చేస్తున్నాయి. విగ్రహం సైజును బట్టి రూ. 3వేలు నుంచి రూ. 25 వేల వరకు విక్రయిస్తున్నారు.