అద్దంకిలో గొర్రెల దొంగల ముఠా అరెస్ట్

అద్దంకిలో గొర్రెల దొంగల ముఠా అరెస్ట్

BPT: బాపట్ల జిల్లాలో గొర్రెలను దొంగిలిస్తున్న ముఠాను బుధవారం అద్దంకి పోలీసులు అరెస్టు చేశారు. చీరాల డీఎస్పీ మొయిన్ అద్దంకిలో కేసుల వివరాల వెల్లడించారు. బాపట్ల, కారంచేడు, మార్టూరు గ్రామాలకు చెందిన నిందితులు ఇటీవల జిల్లాలో గొర్రెల దొంగతనాలకు పాల్పడ్డారు. వీరిని అద్దంకిలో అరెస్టు చేసి, రూ.3,72,000ల విలువైన గొర్రెలు, పొట్టేళ్లను స్వాధీనం చేసుకున్నారు.