వినుకొండ వాసికి రాణి రుద్రమదేవి జాతీయ అవార్డు

గుంటురూ: వినుకొండ పట్టణానికి చెందిన అబిల్ కలాం తెరిసా సేవా సొసైటీ వ్యవస్థాపకురాలు చందోలు నాగవాణికి రాణి రుద్రమదేవి జాతీయ ఉత్తమ మహిళా సేవా పురస్కారం లభించింది. మాక్స్ గ్లోబల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాదులోని రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో ఆమె ఈ అవార్డును అందుకున్నారు. అవార్డు పొందిన నాగవాణిని పలువురు అభినందించారు.