కొండాపురంలో రైలు కిందపడి వ్యక్తి మృతి

కొండాపురంలో రైలు కిందపడి వ్యక్తి మృతి

KDP: కొండాపురం గ్రామం శివారులోని పంపు హౌస్ - చిత్రావతి రైల్వే బ్రిడ్జి మధ్యలో శుక్రవారం రాత్రి రైలు కిందపడి వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు అందించిన సమాచారం మేరకు.. మృతుడు కొండాపురం మండలం లావనూరుకి చెందిన మహేష్ (28)గా గుర్తించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.