బెంగళూరు ట్రాఫిక్‌పై శుభాంశు శుక్లా సెటైర్లు
బెంగళూరు ట్రాఫిక్‌పై శుభాంశు శుక్లా సెటైర్లు వేశారు. ఈ ట్రాఫిక్‌లో ప్రయాణించడం కన్నా అంతరిక్షానికి వెళ్లడం చాలా సులభమని ఎద్దేవా చేశారు. మార్తహళ్లి నుంచి బెంగళూరు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ వరకు ప్రయాణించడానికి గంటకుపైగా పట్టిందన్నారు. ఈ టెక్ సమ్మిట్‌లో తన ప్రజెంటేషన్ టైం కంటే రావడానికి పట్టిన సమయమే 3 రెట్లు ఎక్కువని చురకలంటించారు.