విద్యుత్ తీగ తెగిపడి ఆవు మృతి

ప్రకాశం: కనిగిరిలోని టీచర్స్ అకాడమీ వీధిలో విద్యుత్ తీగ తెగిపడడంతో అటుగా వెళుతున్న ఆవుకు తీగ తగలడంతో ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు సమాచారం అందించడంతో మున్సిపల్ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మున్సిపల్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని, విద్యుత్ సిబ్బందితో తెగిపడిన విద్యుత్ తీగను తొలగించి, మరమ్మత్తులు చేసి, మృతిచెందిన ఆవును తరలించారు.